- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం..
‘దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటినా బీసీలో కొన్ని కులాలు నేటికీ సామాజిక వివక్షకు, వెలివేతకు, గ్రామబహిష్కరణకు గురవుతున్నాయి. ఆధిపత్య కులాల దాష్టీకాలకు బలి అవుతున్నారు, ఈ దాడుల నుండి, ఈ సామాజిక వివక్ష నుండి తమని తాము కాపాడుకోవాలంటే బీసీ సామాజిక భద్రతా చట్టం కావాలి. బీసీలు బాధలు, అవమానాలు, పరాభవాల అనుభవం పొందివుంటారు. బీసీ బిల్లు ఆమోదం పొందితే అసెంబ్లీ, పార్లమెంట్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీల మీద జరిగే దాడులను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది. బ్రిటీష్ కాలంలో జరిగిన బీసీల జనగణననే తప్ప ఇప్పటివరకు మళ్లీ జరుగలేదు.’
చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ కల్పించాలని దశాబ్దాల పోరాటం.. ఇదేదో ఆర్థిక అధికారం కోసం కాదు, దశాబ్దాలుగా అణచబడుతున్న, అణగదొక్కబడుతున్న, వెనక్కి నెట్టి వేయబడుతున్న బడుగు బలహీన వర్గాల ఆక్రోశం. బీసీల అస్తిత్వం కోసం ఆత్మగౌరవ నినాదం. దేశంలో ఉన్న అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కోసం న్యాయమైన వాటా కోసం మేమెంతో మాకంతా కావాలి, ఇంకెంత కాలం మా ఓట్లతో మా సీట్ల మీద ఆధిపత్యకులాలు కూర్చుంటారు. ఇక కుదరదు మా ఓట్లు మా సీట్లు ఇక మావే. బీసీ సమాజం ‘సీట్ హమారా, రాజ్ హమారా’ అంటున్నది. నేడు బీసీలలో చైతన్యం పెరిగింది. విద్యా, విజ్ఞానం, ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక విధానంపై దృష్టి పెట్టారు. తాము ఇంతకాలం ఏం కోల్పోయామో అర్థం అయ్యింది. ఇవన్నీ కావాలంటే బీసీలకు రాజ్యాధికారం ఒక్కటే మార్గం. అందుకే చట్టసభలలో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించాలనే డిమాండ్ రోజురోజుకూ బలోపేతమవుతోంది. బీసీ ప్రధాని ఉన్నప్పుడు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి చాలా సులువుగా బీసీ బిల్లు ఆమోదించబడుతుంది. ఇతర పార్టీల డిమాండ్ కూడా అదే కనుక అందరూ మద్దతూ పలుకుతారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి ఉంటే చాలు. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ. అన్ని రుగ్మతలకు దానితోనే చెక్ పెట్టవచ్చు.
కొనసాగుతున్న పరాభవాలు..
దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటినా బీసీలో కొన్ని కులాలు నేటికీ సామాజిక వివక్షకు, వెలివేతకు, గ్రామ బహిష్కరణకు గురి అవుతున్నాయి. ఆధిపత్య కులాల దాష్టీకాలకు బలి అవుతున్నారు, ఈ దాడుల నుండి, ఈ సామాజిక వివక్ష నుండి తమని తాము కాపాడుకోవాలంటే బీసీ సామాజిక భద్రతా చట్టం కావాలి. బీసీలు బాధలు, అవమానాలు, పరాభవాల అనుభవం పొందివుంటారు. బీసీ బిల్లు ఆమోదం పొందితే అసెంబ్లీ, పార్లమెంట్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీల మీద జరిగే దాడులను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది. బ్రిటీష్ కాలంలో జరిగిన బీసీల జనగణననే తప్ప ఇప్పటివరకు మళ్లీ జరుగలేదు. రాజ్యాంగంలోని 15(4)(5) 16(4) ప్రకారం వెనకబడిన కులాలకు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కల్పించాలని స్పష్టంగా ఉంది, జనాభా లెక్కలు లేకుండా బీసీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించారో, ఎంతమందికి చేకూరిందో కూడా శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. మండల్ కమిషన్ ద్వారా 27శాతం రిజర్వేషన్స్ సాధించుకుంటే వాటిని పూర్తిగా అమలుచేయకుండా ఎవరికీ లేని క్రిమిలేయర్ బీసీలకు మాత్రం వర్తింపచేస్తున్నారు. బీసీ జనాభా లెక్కలు తీయాలి. బీసీలు కోల్పోయిన కోటిన్నర బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి? ఏ కాకులు ఎత్తుకుపోయాయి? ఏ లెక్కలలో కలిపారో తేల్చాలి.
సంపదలో వాటాదారులు..
నీట్ నుంచి ఓబీసీ రిజర్వేషన్స్ తీసివేశారు, వాటిని యధాతథంగా ఉంచాలి. లాభదాయక సంస్థలను, ఎల్‌ఐసీ, రైల్వేలాంటి వాటిని ప్రయివేటీకరణ చేస్తున్నారు. ఇది బడుగు, బలహీనవర్గాల పొట్ట కొట్టడమే. మెల్లగా రిజర్వేషన్స్ తీసివేయాలనే కుట్రలను పసిగట్టాలి. రాజకీయ నిర్మాణం అంటే ప్రజాసామాజిక వికాస నిర్మాణమే. ఆ స్ఫూర్తికి దెబ్బ కొట్టకూడదు. అన్నివర్గాల క్షేమం అభ్యున్నతి, అభివృద్ధి దేశం దేదీప్యమానంగా వెలగడానికి కారణం అవుతుందని పాలకులు గుర్తు పెట్టుకోవాలి. శ్రామిక కులాలు సంపద సృష్టించడంలోనే కాదు ఉత్పత్తి కులాలుగా, సంపదలో వాటాదారులుగా మారి తద్వారా దేశ ఆర్థిక విజయాభివృద్దికి తోడ్పడుతారు. బీసీల రాజకీయ చైతన్యం ఎన్నింటికో పరిష్కారం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అప్పుడే బీసీ సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు పరిష్కారం సులువుగా లభించేలా మార్గాలు అన్వేషించి బీసీలకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. మహిళా బిల్లు ఆమోదించి, బీసీ మహిళలకు సబ్-కోటా కల్పించాలి.
-గుండ్రాతి శారదాగౌడ్
హైకోర్టు సీనియర్ అడ్వకేట్
వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజనజాగృతి.