లాక్‌డౌన్..భయం లేదు!

by Shyam |
లాక్‌డౌన్..భయం లేదు!
X

దేశమంతటా కరోనా విజృంభిస్తుండంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్‌డౌన్ విధించింది. కానీ, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ జనాలు రోడ్లపైకి వస్తున్నారు. కొందరేమో నిత్యవసర సరుకులు తీసుకునేందుకు వస్తుంటే, మరికొందరు వాహనాలపై తిరుగుతున్నారు. కనీసం ఫేస్ మాస్కులు ధరించకుండా తిరగడం ఆందోళన కల్గిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పూర్తిగా నిలిచిపోగా, ప్రయివేటు వాహనాలు, కార్లు, ఆటోలు, బైకులపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు మాత్రమే చొరవ తీసుకుంటే సరిపోదు. దేశప్రజలందరూ తమ వంతు బాధ్యతగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
Tags: lockdown, ts, indian govt, public on roads, govt rules break

Advertisement

Next Story

Most Viewed