- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు మా కుటుంబం తల్లడిల్లిపోయింది : పవన్
దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిమాన హీరోకి బాలేదని తెలియడంతో ఆవేదనతో ట్విట్టర్ మాధ్యమంగా సందేశం విడుదల చేశారు. తన అభిమాన హీరో, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో.. తామంతా అమితాబ్ బచ్చన్ అభిమానులమని చెబుతూ, ‘‘నాకిప్పటికీ గుర్తు. అప్పట్లో మీరు ‘కూలీ’ చిత్రం షూటింగ్ సందర్భంగా గాయపడితే మా కుటుంబం యావత్తు తల్లడిల్లిపోయింది. మా అమ్మ, నాన్నతో సహా ప్రతి ఒక్కరం మీ ఆరోగ్యం కోసం ప్రార్థించాం. అన్ని వయసుల వారి నుంచి మీరు ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు అందుకుంటున్నారు. కానీ.. మీరు, మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారని తెలియగానే ఎంతో బాధపడ్డాను. ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని, మీరు, అభిషేక్ సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతరించుకోవాలని ఆశిస్తున్నాను… ఇట్లు మీ అభిమాని పవన్ కల్యాణ్’’ అంటూ సందేశం వెలువరించారు.