- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ హింసాకాండపై 12న విచారణ
by Shamantha N |
X
ఢిల్లీ అల్లర్లపై రాజకీయ నేతల విద్వేష ప్రసంగాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను ఈ నెల 12న విచారించనున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. ఇటీవల ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో 50 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు అనురాగ్ ఠాకుర్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్, మజ్లిస్ నేత ఒవైసీ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటిపై త్వరితగతిన విచారించాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నాయి.
Tags: delhi riots, delhi, high court,Delhi violence
Advertisement
Next Story