16 మంది పోలీసులకు ప్రమోషన్లు

by Shyam |
16 మంది పోలీసులకు ప్రమోషన్లు
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మంది పోలీసులకు సీపీ అంజనీకుమార్ శుక్రవారం ప్రమోషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరిని ఏఎస్ఐ నుంచి ఎస్ఐ గా, 14 మందికి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా ప్రమోషన్ పొందారు.

వీరిలో ఏఎస్ఐ నుంచి ఎస్ఐలుగా ప్రమోషన్ పొందిన వారిలో ఎం.లక్ష్మీనారాయణ (మారేడుపల్లి) జి.రవీందర్ (ఇంటిలిజెన్స్) ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐలుగా ప్రమోషన్ పొందిన వారిలో అబిద్ బిన్ (అఫ్జల్ గంజ్), ఎంఏ సత్తార్ (గోల్కొండ), జి.శ్రీరామ్ మూర్తి (మీర్ చౌక్ ట్రాఫిక్), జి.బుచ్చారెడ్డి (అబిడ్స్), ఎమ్మాస్ జీఎల్ మల్లికార్జున్ రావు (పంజాగుట్ట), మీర్జా ముజఫర్ అలీ ( చాదర్ ఘాట్), హెచ్ నంద్రేకర్ (ఎస్సార్ నగర్), మహమ్మద్ హఫీజుద్దీన్ (ఎస్బీ), మహమ్మద్ నయీముద్దీన్ (చిలకలగూడ), ఎం.సదయ్య ((గోపాలపురం), ఆర్.శివరాములు (నారాయణగూడ), పి.వెంకటేశ్వర్లు (డిటెక్టివ్ విభాగం), ఎండీ మాజీద్ జహీర్ ఖాన్ (ఇంటిలిజెన్స్ ), కె.ఆంజనేయులు (బోయిన్ పల్లి) తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ పదోన్నతి పొందిన వారిని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed