- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదోన్నతుల ప్రక్రియను సిద్దం చేయాలి: శ్రీనివాస్‌గౌడ్
దిశ, క్రైమ్ బ్యూరో: ఎక్సైజ్ శాఖలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, కొత్త సంవత్సరంలో పోస్టింగ్‌లు, బదిలీలు అయ్యేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరంలో ఇన్‌స్పెక్టర్ నుంచి అడిషనల్ కమిషనర్ వరకు పదోన్నతులపై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా నందనవరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న నీరా, నీరా ఉత్పత్తుల యూనిట్ ప్రాజెక్టు రిపోర్టును సిద్దం చేయాలని, ప్రాజెక్టు నిర్మాణ టెండర్ ప్రక్రియకు చర్యలు చేపట్టాలన్నారు. చాలా క్లిష్టతరమైన విధానం వల్లనే ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడి తీవ్రగాయమై శాశ్వతంగా అంగవైకల్యం చెందుతున్న గీత కార్మికులను పరిహారం అందడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పద్దతిలో నిబంధనలు సులభతరంగా ఉండేలా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాలన్నారు. సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, ఆబ్కారి శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, అదనపు కమిషనర్ అజయ్ రావు, డీసీలు ఖురేషి, అంజన్ రావు, హరికిషన్ పాల్గొన్నారు.