నిషేధాజ్ఞలు ప్రారంభమైనయి.. ఎక్కడంటే..?

by srinivas |
నిషేధాజ్ఞలు ప్రారంభమైనయి.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో నిషేధాజ్ఞలు ప్రారంభమయ్యాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు విధించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధించారు. ఆగస్టు 31వ తేదీ వరకు 46 రోజులపాటు కమిషనరేట్ పరిధిలో ఈ నిషేదాజ్ఞలు కొనసాగనున్నాయి. ఐదుగురు లేదా అంతకుమించి జనం ఒక దగ్గర ఉండరాదని, కర్రలు, రాళ్లు వంటివి పట్టుకుని తిరుగొద్దని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story