- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ తల అడగలేదు.. కోదండ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ తల అడగలేదని.. కేవలం చేనేతకు సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే అడిగామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో చేనేత జాతీయ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చేనేత కార్మికులు సైతం భాగస్వాములయ్యారన్నారు.
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా వాటా మాకు దక్కాలని చేనేత కార్మికులు కోరడంలో తప్పులేదన్నారు. మగ్గాలే ఆయుధం కావాలని, కొట్లాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు. కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నంత వరకే చేనేత గురించి మాట్లాడి తర్వాత విస్మరిస్తారన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ పథకాల గురించి మాట్లాడి మాటతప్పుతాడని ధ్వజమెత్తారు. చేనేత కార్మికుల ఉద్యమంలో టీజేఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్, వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర నాయకురాలు ఇందిరాశోభన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు, రాజు, దేవేందర్, ప్రొపెసర్ హరగోపాల్, టీడీపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ప్రసూన, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, చిక్క దేవదాసు, లక్ష్మీనర్సయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.