- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీని ఓడించడానికి దేనికైనా సిద్ధమే : ప్రియాంక గాంధీ
లక్నో: వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నదని ప్రియాంక గాంధీ ఆదివారం వెల్లడించారు. ‘పొత్తుపై మా అభిప్రాయాలు వెల్లడించడంలో సంకోచించడం లేదు. అయితే, ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యం. అందుకు దేనికోసమైనా సిద్ధమే. పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ తన వ్యూహాన్ని ఏర్పరుచుకుంటుంది’ అని తెలిపారు.
ఎన్నికల్లో పొత్తుపై స్పందించాలని ప్రత్యేకంగా కోరగా, కాంగ్రెస్‌ను బలహీనపరిచే నిర్ణయాలు తీసుకోబోమని వివరించారు. పొత్తు ఆలోచనకు తాము అనుకూలంగానే ఉన్నామని చెప్పారు. ఎన్నికల సమీపిస్తున్నవేళ ఇప్పటికే పలుపార్టీలు పొత్తుపై తమ అభిప్రాయాలు వెల్లడించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్‌పీ ఇప్పటికే స్పష్టం చేయగా, బీజేపీ ప్రత్యర్థ పార్టీలన్నింటితోనూ పొత్తు సిద్ధంగా ఉన్నామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ వెల్లడించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన బాగీదారి సంకల్ప్ మోర్చాతో కలిసి పోటీ చేస్తామని ఎంఐఎం తెలిపింది. చిన్న చిన్న రాజకీయపార్టీలతో పొత్తుపెట్టుకుంటామని ఎస్‌పీ పేర్కొంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 2017లో బీజేపీ కూటమి 305 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 7స్థానాలు, దాని మిత్రపక్షం సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లు గెలుచుకుంది.