ఆర్‌జే బాలాజీకి జోడీగా నటించబోతున్న ప్రియా ఆనంద్

by Jakkula Samataha |
ఆర్‌జే బాలాజీకి జోడీగా నటించబోతున్న ప్రియా ఆనంద్
X

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బధాయి హో’ తమిళ్‌లో రీమేక్ అవుతోంది. ఆర్‌‌జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆర్‌జే బాలాజీ కీ రోల్ ప్లే చేస్తుండగా.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బోనీ కపూర్.. ఈ చిత్రం క్లాస్ అండ్ మాస్‌ను అట్రాక్ట్ చేస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇక తమిళ్ వెర్షన్‌లో హీరోయిన్ ప్రియా ఆనంద్ ఫీమేల్ లీడ్ ప్లే చేస్తుండగా.. సత్యరాజ్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. కాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

తమ తల్లిదండ్రులు లేటు వయసులో మరోబిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలిశాక.. ఓ 25 ఏళ్ల కుర్రాడి లైఫ్ ఎలా టర్న్ అవుతుందనేదే ‘బధాయి హో’ సినిమా కథ. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, సన్యా మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించగా.. నీనా గుప్తా, గజ్‌రాజ్ రావు, సురేఖా సిఖ్రి ప్రధానపాత్రల్లో కనిపించారు.

Advertisement

Next Story