- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూతురి స్క్రిప్ట్‌తో సినిమా తీస్తున్న హీరో..
దిశ, సినిమా : మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగానే కాదు నిర్మాతగాను సక్సెస్ అందుకున్నారు. ‘లూసిఫర్’ ద్వారా డైరెక్టర్‌గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తన సెకండ్ డైరెక్టోరియల్ వెంచర్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన ఏడేళ్ల కూతురు అలంకృత రాసిన స్క్రిప్ట్ బేస్ చేసుకుని రెండో సినిమా ఉండబోతుందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా షేర్ చేశాడు. ‘ తండ్రి కొడుకులు అమెరికాలో నివసిస్తుంటారు. రెండో ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో వారిద్దరిని రెఫ్యూజీ క్యాంప్‌కు తరలిస్తారు అధికారులు. అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉన్న తండ్రీ కొడుకులు వార్ ముగియడంతో తిరిగి ఇంటికి వచ్చి సంతోషంగా జీవిస్తుంటారు ది ఎండ్’ అని కూతురు రాసిన స్క్రిప్ట్ చూసి గర్వంగా ఫీల్ అవుతున్నానని, లాక్ డౌన్‌లో తాను విన్న బెస్ట్ స్టోరీ లైన్ ఇదేనని, కానీ కరోనా మహమ్మారి సమయంలో చిత్రీకరించడం అసంభవమని మరో సినిమా ఎంచుకున్నట్లు చెప్పాడు. కానీ, ఇప్పుడు మళ్లీ కెమెరా వెనకాలకు వెళ్లాలని ఉందంటూ.. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయగానే డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుని షూటింగ్ మొదలుపెడతానని తెలిపాడు.
This was the best story line I heard during this lockdown. But since shooting this in the midst of a pandemic seemed an unlikely proposition, I chose another script. Yup. Thinking of getting behind the camera again. Details will follow soon 🙂 #DirectionBugBites #Ally’stories pic.twitter.com/ginaecgSpG
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 16, 2021