PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథితో మోడీ భేటీ..!

by Shamantha N |
PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథితో మోడీ భేటీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- బంగ్లాదేశ్‌ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిమ్‌స్టెక్‌ సదస్సు సందర్భంగా బ్యాంకాక్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. గత ఆగస్టులో బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా యూనస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇదే. అయితే, మోడీతో భేటీ కోసం యూనస్ తరఫున బంగ్లా విదేశాంగ శాఖ భారత్ ను కోరింది. తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. సానుకూల నిర్ణయమే వస్తుందని ఢాకా ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా..బిమ్ స్టెక్ సదస్సులో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు ఇద్దరు నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. బిమ్ స్టెక్ నాయకుల విందులో సైతం మోడీ, యూనస్ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నట్లు కన్పించారు.

ఈశాన్య రాష్ట్రాలపై కామెంట్స్..

ఓవైపు బీజింగ్‌-ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతుండగా మోడీ- యూనస్ మధ్య చర్చలు జరగడం గమనార్హం. ఇటీవలే మహమ్మద్‌ యూనస్‌ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలను చేరుకునేందుకు సముద్రమార్గం లేదని.. ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ కామెంట్లు చేశఆరు. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్లు ఉన్నాయన్నారు. బిమ్‌స్టెక్‌ దేశాలకు ఇది కీలకమైన కనెక్ట్‌విటీ హబ్‌గా అభివర్ణించారు.

Next Story

Most Viewed