- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా గదిలోకి వెళ్లి ఏడ్చాను : పృథ్వీ షా
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీ.. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే ఆలౌట్ అయ్యాడు. విదేశీ గడ్డపై పూర్తిగా విఫలం కావడంతో పృథ్వీషా చాలా బాధపడ్డాడట. తొలి టెస్టు ముగిసిన తర్వాత గదిలోకి వెళ్లి ఏడ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో 754 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన పృథ్వీషా తాజాగా మీడియాతో మాట్లాడాడు. ‘తొలి టెస్టు ముగిసిన తర్వాత నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. నా బ్యాటింగ్‌లో ఉన్న లోపాలేంటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అది డే/నైట్ టెస్టు కావడం వల్లే నా బ్యాటింగ్ అంత ప్రభావితం చూపలేదు. అయినా నేను మేటి జట్టుతో ఆడి విఫలమయ్యాను’ అని తనకు తాను చెప్పకున్నట్టు పృథ్వీషా చెప్పాడు. తాను ప్రపంచంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌లలో చెత్త ఆటగాడిని కాదని నాకు నేనే సర్థిచెప్పుకున్నా అని అన్నాడు. తొలి టెస్టులో పృథ్వీషా విఫలమవడంతో అతడి స్థానంలో వచ్చిన శుభమన్ గిల్ అద్భుతంగా రాణించాడు. దీంతో పృథ్వితో సహా మయాంక్ అగర్వాల్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యారు.