- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో స్వేచ్ఛ ఇంపార్టెంట్ అంటున్న ‘ప్రిన్సెస్ సిడ్’
దిశ, సినిమా : ‘ప్రిన్సెస్ సిడ్’.. టైటిల్ వినగానే, ఇదేదో అందాల రాకుమారికి సంబంధించిన రొటీన్ స్టోరీ అనుకుంటాం. సవతి తల్లి బాధించడం, ఓ రాకుమారుడు రెక్కల గుర్రంపై వచ్చి తనను కాపాడటం వంటి ఫెయిర్ టేల్ ఉంటుందనే అభిప్రాయానికి వస్తాం. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రజెంట్ జనరేషన్‌ను ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుంది సినిమా. బంధాలు, పెద్దరికాలు కాకుండా.. స్వేచ్ఛ అనేది ఎంత అవసరమో చూపిస్తుంది. టీనేజర్ ‘ప్రిన్సెస్ సిడ్’ గార్డియన్‌షిప్‌ను తన ఆంటీ మిరాండాకు ఇవ్వడంతో చికాగోకు చేరుకుంటుంది. నచ్చిన విధంగా జీవితాన్ని లీడ్ చేయాలనుకునే సిడ్.. తను కావాలనుకున్న దాన్ని స్పష్టంగా అడిగేటువంటి నేచర్ కలిగి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతీ మూమెంట్‌ను హ్యాపీగా గడపాలని, బాధకు దూరంగా ఉండాలని అనుకుంటుంది. కానీ కొత్త ప్లేస్‌లో ఎదురయ్యే సవాళ్లతో కాంప్రమైజ్ అవుతుందా? లేదా ఫ్రీడమ్‌ను వెతుక్కుంటూ ప్రయాణిస్తుందా? అనేదే కథ..
ఇదిలా ఉంటే, సిటీకి కొత్త అయిన సిడ్.. ఒకరోజు బయటకు వెళ్లినప్పుడు ఇంటికి వెళ్లే దారి మరిచిపోతుంది. ఈ క్రమంలో లోకల్ బారిస్టాలో వెయిట్రెస్‌గా వర్క్ చేసే కేటీ అనే అమ్మాయి హెల్ప్ తీసుకుంటుంది. ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో తన బ్రదర్‌తో కలిసి ఉండే కేటీ పట్ల ఆకర్షణకు లోనైన ప్రిన్సెస్ సిడ్.. సొసైటీచే చాలెంజ్ చేయబడిన హెటిరో సెక్సువల్ రిలేషన్‌షిప్‌కు ఓకే చెప్తుంది. తద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తన సెక్సువాలిటీకి వెల్‌కమ్ చెప్పినట్లు సూచించారు మేకర్స్. ఈ విషయాల గురించి తెలుసుకున్న సిడ్ ఆంటీ.. తనను డిసిప్లెయిన్‌లో పెట్టాలని ఆలోచించకుండా పూర్తి ఫ్రీడమ్ ఇస్తుంది. తన కోడలి ఆలోచనలు, నమ్మకాలు డిఫరెంట్ అని తెలుసుకుని వాటిని గౌరవిస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ‘హ్యాపీనెస్ అనేది యూనిక్’.. ‘విభిన్న ఆకారాలు.. విభిన్న మార్గాలను కలిగి ఉంటాయి’ అనే నమ్మకంతో తనతో కలిసి ఒక ఫ్రెండ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటుంది.
నిజానికి ఫిమేల్ లీడ్ ప్రమాదంలో చిక్కుకుంటే ఇతరులు వచ్చి కాపాడటం రెగ్యులర్ మూవీ ఫార్మాట్. కానీ ఈ సినిమాలో అలాంటి ఆలోచన కూడా రీకన్‌స్ట్రక్ట్ చేయబడింది. కేటీ ఆపదలో ఉన్నప్పుడు.. సిడ్, మిరాండా కలిసి తనను అపార్ట్‌మెంట్ నుంచి కాపాడటంతో పాటు తనకు ఎమోషనల్‌గా సపోర్ట్ ఇచ్చినట్లు చూపడం ద్వారా ప్రజెంట్ సొసైటీలో ఫ్రెండ్‌షిప్స్, రిలేషన్స్ ఎలా ఉన్నాయనే బ్రీఫ్ నోట్‌ను పరిచయం చేశారు. మొత్తానికి మూడుపాత్రలు కూడా తమ జీవితాన్ని సొంత మార్గాల్లో అన్వేషిస్తున్నట్లు చూపించగా… ఆధునిక సంబంధాలు, స్నేహాల గురించి ఆలోచింపజేస్తుంది.