- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ చానల్ ప్రారంభించిన రాయల్ జంట
దిశ, ఫీచర్స్ : బ్రిటన్ రాజకుటుంబంలో ప్రిన్స్ విలియమ్ హ్యారీ దారే వేరు. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు నచ్చకపోవడంతో ప్యాలెస్‌ను వీడిన హ్యారీ దంపతులు.. కాలిఫోర్నియాలో స్థిరపడ్డ విషయం తెలిసిందే. ఇలా సంచలనాలకు మారుపేరుగా మారిన హ్యారీ, కేట్ జంట తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి’ అనే తమ అధికారిక పేజీ ద్వారా యూట్యూబ్ చానల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఈ రాయల్ జంట.. తమ గత పర్యటనలు, అప్పియరెన్సెస్‌తో కూడిన గ్లింప్స్ వీడియోను పోస్ట్ చేస్తూ, తాము ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్నామని పేర్కొంది. కాగా, ఈ వీడియో రీల్ రెండు బ్లూపర్లను కూడా చూపించింది. వాటిలో విలియం తన భార్యతో ‘నువ్వు ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే వీళ్లు మనకు సంబంధించిన ప్రతీది చిత్రీకరిస్తున్నారు’ అంటూ చెణుకు విసిరాడు. ఇక మరొక వీడియోలో తానేం తక్కువ కాదని నిరూపించిన కేట్.. తన భర్తతో ‘మీరు మీ‘ r ’ను అంతగా రోల్ చేయాల్సిన అవసరం లేదు’ అంటూ జోక్ పేల్చింది.
కాగా ఈ రాయల్ జంట ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కానీ వారి స్వాగత వీడియో సూచించినట్లుగా, ఇది వారి రాయల్ వర్క్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇంతకీ యూట్యూబ్ చానెల్ పేరు చెప్పలేదు కదా.. ‘The Duke and Duchess of Cambridge’. ఇప్పటికే 208k సబ్‌స్కైబర్స్ ఉన్న కొత్త చానెల్ ద్వారా ఈ రాయల్ కపుల్ అభిమానులకు ఎలాంటి కంటెంట్ అందిస్తారో వేచి చూడాలి.