బస్సు ప్రమాదం బాధాకరం.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

by Anukaran |
PM Modi
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులోకి దూసుకెళ్లి 9 మంది ప్రయాణికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. బస్సు వాగులో పడిన సమయంలో 47 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాగులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బస్సు ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్ర్భాంతికి గురైనట్లు తెలిపారు. అంతేగాకుండా.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దీంతో ప్రమాదంపై తక్షణమే స్పందించిన బాధిత కుటుంబాలకు సాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed