8 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

by Anukaran |
8 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొత్తగా 8 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించారు. ఆదివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్ల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ రైళ్లు గుజరాత్‌లోని కెవాడియా పట్టణం నుంచి దేశంలోని ఎనిమిది ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. కెవాడియా-వార‌ణాసి, కెవాడియా-దాద‌ర్‌, కెవాడియా-అహ్మ‌దాబాద్‌, కెవాడియా-హ‌జ్ర‌త్‌, కెవాడియా-నిజాముద్దీన్‌, కెవాడియా-రేవా, కెవాడియా-చెన్నై, కెవాడియా-ప్ర‌తాప్‌న‌గ‌ర్ మ‌ధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి.

కెవాడియా ప‌ట్ట‌ణం ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌ైన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి హోమ్‌టౌన్‌. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ 143వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని 2018 అక్టోబ‌ర్‌లో ప‌టేల్ భారీ విగ్ర‌హ‌మైన స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీని ఆవిష్క‌రించారు. స్టాట్యూ అఫ్ లిబ‌ర్టీకి ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి క‌నెక్టివిటీ స‌దుపాయం క‌ల్పించ‌డానికి కొత్త‌గా రైళ్ల‌ను ప్రారంభించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed