- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలి..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై పనిభారంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని తగ్గించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లాలో సూసైడ్ చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్‌కు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. అన్ని మండలాల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.
హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో ఉన్న బాధలన్నీ వివరిస్తూ అన్యాయన్ని క్షుణ్ణంగా రాయడం కలిచివేసిందన్నారు. జగన్నాథ్ సూసైడ్‌నోట్‌లోని అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాలను నిగ్గు తేల్చి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
పంచాయతీ కార్యదర్శుల ఒత్తిళ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల పరిధిలో గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసనలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.