విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధం..!

by Shyam |   ( Updated:2021-12-27 07:18:21.0  )
electricity
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ఇప్పటికే ఇంధన ధరలు భారీగా పెరిగి కన్నీరు తెప్పిస్తుంటే విద్యుత్ చార్జీల ధరలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను కంపెనీలు రెగ్యులేటరీ కమిషన్‌కు నివేదించాయి. ఈ క్రమంలో డొమెస్టిక్ కన్స్యూమర్ల విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూ.50 పైసలు, ఎల్‌టీ యూజర్ల విద్యుత్ వినియోగంపై యునిట్‌కు రూ.1 పెంచేందుకు అనుమతులివ్వాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story