కరోనాతో గర్భిణీలు తీవ్ర అవస్థలు

by Shyam |
కరోనాతో గర్భిణీలు తీవ్ర అవస్థలు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. “గర్భిణీ స్త్రీలను ప్రసవాల కోసం ఆసుపత్రులు నిర్లక్ష్యంగా నిరాకరిస్తున్నాయని, వారి సమస్యలకు అవసరమైన వైద్య సలహాలు ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారని ఇది పూర్తిగా అమానవీయమైనది , భరించలేనిది” అని హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ (హెచ్‌సిసిసి) మైనారిటీల విభాగం చైర్మన్ సమీర్ వల్లిల్లా అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు . హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌ ఆస్పత్రిలో ఇటీవల మృతి చెందిన నిండు గర్భిణీ పావని అంశాన్ని ఉటంకిస్తూ సమీర్ వాలిల్లా మాట్లాడుతూ ఐదు ఆస్పత్రులు ఆమెకు ప్రవేశం నిరాకరించాయని, దీని ఫలితంగా అంబులెన్స్‌లోనే ఆమె మరణానికి దారితీసిందని అన్నారు. ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించిన ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం డబుల్ హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆమెకు వైద్య చికిత్సను తిరస్కరించడం ద్వారా వారు పావనిని మాత్రమే కాకుండా పుట్టడానికి కొన్ని గంటల ముందు ఆమె గర్భంలో ఉన్న పిల్లవాడిని హత్య చేశారని అన్నారు. పావని మరణానికి , ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవేశం నిరాకరించబడినందును వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని అన్నారు. లాక్ డౌన్ కాలంలో రవాణా లేకపోవడం వల్ల వందలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదని ఆయన అన్నారు. గర్భిణీ మహిళల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే సానుకూల సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed