- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డుపై సమ్మక్క ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
by Shyam |
X
దిశ, మంగపేట: రోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటన మంగపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మండలంలోని కొత్తపేట చౌళ్లబోరుకు చెందిన మలకం సమ్మక్కకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో స్థానిక ఆశావర్కర్ సహకారంతో మంగపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ఎదుట కొత్తగా సీసీ రోడ్ వేయడంతో ఆటో ఆస్పత్రిలోకి వెళ్లే దారి లేక రోడ్డుమీద నిలిపేశారు. ఇదే సమయంలో సమ్మక్కకు పురిటినొప్పులు తీవ్రతరం కావడంతో, ఆశావర్కర్ రోడ్డుమీద ఉన్న ఆటోలోనే నార్మల్ డెలివరీ చేసింది. సమ్మక్క మగబిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సమ్మక్కకు నార్మల్ డెలివరీ చేసిన ఆశావర్కర్ విజయ, చంద్రవాణీలను ఆసుపత్రి వర్గాలు అభినందించాయి.
Advertisement
Next Story