కరోనాకు చెక్ చెప్పాలంటే.. స్మార్ట్ ఫోన్ ను క్లీన్ చేయాల్సిందే!

by Sujitha Rachapalli |
కరోనాకు చెక్ చెప్పాలంటే.. స్మార్ట్ ఫోన్ ను క్లీన్ చేయాల్సిందే!
X

దిశ వెబ్ డెస్క్: నిత్యం మనం వాడే స్మార్ట్‌ఫోన్‌పై కూడా క్రిములు ఎక్కువగానే ఉంటాయి. టాయిలెట్ సీట్ కన్నా 10 రెట్ల ఎక్కువ క్రిములు స్మార్ట్‌ఫోన్‌పై ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో సెల్ ఫోన్ విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. సెల్ ఫోన్ కు వాడే కేసులు ప్లాస్టిక్ అయితే మరింత ప్రమాదకరం. కరోనా నుంచి రక్షించుకోవడానికి ముఖానికి మాస్క్ ఉపయోగిస్తున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ నుంచి ప్రమాదం పొంచి ఉండవచ్చు. స్మార్ట్ ఫోన్లు అన్ని రకాల క్రిములను, సులభంగా పట్టుకుంటాయి. చేతులు శుభ్రం చేసుకున్నా మొబైల్ శుభ్రంగా లేకపోతే తిరిగి సూక్ష్మ క్రిములు మనల్ని చేరతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ కూడా రోజు వాష్ చేయాల్సిందే.

మన మొబైల్ చూడ్డానికి రోజూ లాగే నిగనిగలాడుతూ.. మెరిసిపోవచ్చు. ఎక్కడా జిడ్డుగా అనిపించకపోకపోవచ్చు. కానీ సగటు మొబైల్ ఫోన్‌లో టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టరీయా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం చేసిన అధ్యయనం ప్రకారం 30 శాతం వైరస్ లు మన ఫోన్ నుంచి చేతులకు అంటుకుంటాయి. వాటితో ముఖాన్ని తాకడం వల్ల కళ్లు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఎలా శుభ్రం చేయాలి:

ఫోన్ బ్యాక్ కవర్ లేదా కేస్ ను ఫోన్ నుంచి తీసేయాలి. అవి ప్లాస్టిక్ లేదా సిలికాన్ వి అయితే గోరు వెచ్చని నీటిలో డిష్ వాష్ లో కలిపి శుభ్రం చేయవచ్చు. లెథర్ వి అయితే క్రిమి సంహారక లిక్విడ్ తో కడగడం ఉత్తమం. అవి పూర్తి గా ఆరిపోయిన తర్వాతనే ఫోన్ కు అమర్చాలి. ఐసో ఫ్రోఫైల్ ఆల్కహాల్ తో ఫోన్ ను క్లీన్ చేయాలి. అయితే రసాయన ద్రావణాలు మాత్రం ఇందుకోసం ఉపయోగించకూడదు. టచ్ పాడయ్యే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు ఫోన్ మాట్లాడటానికి ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ లను ఉపయోగించాలి. అయితే వీటిని కూడా బాగా కడగాలి. ఐసో ఫ్రోఫైల్ ద్రావణంతో తుడవాలి. చార్జింగ్ పోర్ట్, ఇయర్ ఫోన్ జాక్ లను కూడా శుభ్రం చేయాలి. అందుకోసం ఇయర్ బడ్స్ ను క్లీనింగ్ ఆల్కహాల్ ముంచి, క్లీన్ చేయాలి. బయటకు వెళ్లినప్పుడు ఫోన్ తీసుకోకపోవడమే ఉత్తమం.

హ్యాండ్ బ్యాగ్:

మహిళలు వాడే హ్యాండ్ బ్యాగ్ కూడా బాక్టీరియా, వైరస్‌లకు నిలయమే. సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే హ్యాండ్ బ్యాగ్‌లపై టాయిలెట్ సీట్ కన్నా 100 రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయి. సో వీటిని కూడా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి.

కార్ స్టీరింగ్:

టాయిలెట్ సీట్ కన్నా 700 రెట్లు ఎక్కువ క్రిములు కార్ స్టీరింగ్‌పై ఉంటాయి. కనుక కారులో బయటకు వెళితే చాలా జాగ్రత్తగా ఉండాలి. విండోలను మూసే ఉంచాలి. కారు తీసేటప్పుడు తప్పనిసరిగా అంతా శుభ్రంగా కడుక్కోవాలి. వచ్చాక కూడా కార్ ని వాష్ చేయాలి.

కంప్యూటర్ కీబోర్డ్… రీమోట్:

నిత్యం మన టక్ టక్ మంటూ టైప్ చేసే కంప్యూటర్ కీబోర్డుపై కూడా కుప్పలు తెప్పలుగా క్రిములుంటాయి. రీమోట్ పై కూడా లక్షలాది బ్యాక్టీరియాలుంటాయి. అందువల్ల బయట నుంచి రాగానే వాటిని తాకకూడదు. వాటిని కూడా తరుచూ శుభ్రపరుస్తూ ఉండాలి.

tags: coronavirus, cleaning, cell phone, bacteria, was carefully, handbag, remote

Advertisement

Next Story

Most Viewed