- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యన్ వ్యాక్సిన్కి భలే గిరాకీ!
దిశ, వెబ్డెస్క్: ప్రపంచ దేశాలు కరోనాతో సతమతమవుతున్న వేళ రష్యా సర్వత్రా తీపి కబురు అందించింది. తాము ‘స్పుత్నిక్ వీ’ పేరుతో వ్యాక్సిన్ను రూపొందించామని… మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తాను, తన కూతురిపై కూడా ప్రయోగించామని చెప్పడం గమనార్హం.
అయితే, ఈ వ్యాక్సిన్ ను కొనేందుకు చాలా దేశాలు తహతహలాడుతున్నాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20 దేశాల నుంచి వ్యాక్సిన్ డోసులు కావాలని ముందుగానే ఆర్డర్లు ఇచ్చారని ఆయన వెల్లడించారు. అయినా కొంత మంది వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇటువంటి వ్యాఖ్యలను ఎప్పటి కప్పుడు ఖండిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘స్పుత్నిక్ వీ’ పై వివరాలను ఎప్పటి కప్పుడు ప్రపంచ దేశాలకు చేరవేస్తామన్నారు.