- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ఉద్యోగులకు వెంటనే PRC విడుదల చేయాలి : దాసోజు శ్రవణ్

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చారు. మరి ఏం పాపం చేశారాని వాటర్ వర్క్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎందుకు పీఆర్సీ ఇవ్వడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం వాటర్ వర్క్స్ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని కోరుతూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాటర్ వర్క్స్, సివరేజ్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, వారు ఒక్క పూట పని ఆపేస్తే నగరంలో తాగడానికి మంచి నీరు దొరకదని, ఎక్కడిక్కడ మురుగు నిలిచిపోతుందన్నారు. వారు ఆరోగ్య భద్రత లేని కార్మికులని వారికి పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనవసరమైన భేషజాలకు పోకుండా వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.