- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైడ్రాక్సీ క్లోరోక్విన్ రియాక్షన్..!
దిశ, ఆదిలాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్ళిన యువకుడికి అక్కడి వైద్య సిబ్బంది హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చారు. రెండు రోజులు గడిచిన తర్వాత మందుల ప్రభావం చూపడంతో ఆ యువకుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం చేసిన ఆస్పత్రికి వెళ్లి తనకు రియాక్షన్ జరిగిన విషయం చెబితే ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని, వేరే చోటికి వెళ్లాలని తిట్టి పంపారని అతను ఆవేదన చెందుతున్నాడు.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన వెల్మల ప్రశాంత్ కుమార్ అనే యువకుడు గత ఏడాది అబుదాబికి వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్ లో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చినట్లు చెబుతున్నాడు. ఆ మాత్రలు వేసుకున్నప్పటి నుంచి వాంతులు, తల తిప్పడం, ఆయాసం, వెన్నునొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి రియాక్షన్ వచ్చిందని ప్రశాంత్ వాపోతున్నాడు. గోలీలు వాడిన తర్వాత వచ్చిన రియాక్షన్ విషయమై ఆస్పత్రికి వెళ్లి చెబితే ఇక్కడికి రావద్దని వెళ్లిపోవాలని హెచ్చరించారని, లేదంటే వేరే ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నారని ఆవేదన చెందుతున్నాడు. కొన్నిసార్లు తీవ్రమైన దమ్ము వస్తోన్నదని బాధితుడు చెప్పాడు. తనను ఇండియాకు తీసుకువెళ్లి చికిత్స చేయించాలని ప్రశాంత్ రోధిస్తూ అధికారులను కోరుతున్నాడు. అక్కడి నుంచి వీడియోలో తాను పడుతున్న బాధలను పోస్ట్ చేశాడు. అది చూసి ప్రశాంత్ తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.