కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్?

by Shamantha N |   ( Updated:2021-07-14 04:41:53.0  )
కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో పాపులర్ అయిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం సాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పీకే సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఎదుర్కొవడంపై చర్చించారని, కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తారనే వార్తలొచ్చాయి.

కానీ గత కొద్దినెలల క్రితం జరిగిన పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల తర్వాత ఇక వ్యూహకర్తగా పనిచేయబోనని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి కూడా రాబోనని క్లారిటీ ఇచ్చారు.ఇలాంటి తరుణంలో జాతీయ రాజకీయాల్లో ఎన్టీయేకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంపై సీనియర్ పొలిటీషియన్ శరద్ పవార్‌తో చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో బీహార్‌లో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూలో ప్రశాంత్ కిషోర్ చేరారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకీ రాజీనామా చేసి బయటికొచ్చారు. ఇప్పుడు మళ్లీ తిరిగి రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ వస్తారా..? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story