- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సురభి నాటక మండలికి ప్రణిత సాయం
దిశ, వెబ్ డెస్క్: నాటకం..తరతరాలను పరిచయం చేస్తుంది. చరిత్ర పుటల్లో దాగిన విజ్ఞాన సంపదను ఈ తరానికి అందిస్తుంది. చరిత్రలో ఉన్న తప్పును ఎత్తి చూపుతూనే..అసలు అలా ఎందుకు జరిగింది? అని చెప్తూ.. అలాంటి తప్పు ఈ తరం చేయకూడదనే సందేశం ఇస్తుంది. అయితే, ఇప్పుడు నాటకాల వ్యాపకం మనిషిలో అంతరించినా..ఆ నాటకాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబం ఉంది. ప్రజలకు పురాణాల పట్ల అవగాహన కల్పిస్తూ అంతరించిపోతున్న నాటకం అనే కళకు ఇంకా ఆయుష్షు పోస్తున్న ఒకే ఒక నాటక మండలి సురభి నాటక మండలి.
తరాలు మారుతున్నా సరే.. నాటకం అనే కళను నమ్ముకున్న ఆ కుటుంబం.. ఇంకా ప్రదర్శనలు ఇస్తూనే ఉంది. మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి పురాణాలను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించడంలో తమ జీవితాలను అంకితం చేసింది ఈ నాటక మండలి కుటుంబం. 130 ఏండ్లుగా కళను బతికిస్తున్న కుటుంబం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రదర్శనలు లేక పస్తులు ఉంటుంది. దాదాపు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొనగా వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది హీరోయిన్ ప్రణిత. ప్రణిత సుభాష్ ఫౌండేషన్ ద్వారా డైరెక్ట్ మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన ప్రణిత..ఇప్పుడు చేసిన ఈ మంచి పనికి ప్రశంసలు అందుకుంటుంది. నీ లాంటి మంచి మనసుకు అంతా మంచే జరుగుతుందని అంటున్నారు ప్రేక్షకులు.