- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూసూద్‌ను సత్కరించిన విలక్షణ నటుడు
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట నటుడు సోనూసూద్ వరాలిచ్చే దేవుడయ్యాడు. క్షేత్ర స్థాయిలో వలస కార్మికుల మధ్య ఉండి.. వారిని ఆయా గమ్య స్థానాలకు చేర్చి ఒక్కసారిగా సోషల్ మీడియా సూపర్ హీరో అయ్యాడు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేని స్థితిలో సోనూసూద్ చేసిన సేవలు చిరస్మరణీయం.
ఆ తర్వాత తన సేవగుణాన్ని యావత్ దేశానికి తెలిపాడు. కష్టాల్లో ఉన్న వారి సాయం చేసి వారి కలలను నిజం చేశాడు. ఇంతటీ వ్యక్తికి సామాన్య ప్రజానీకం నుంచి రాజకీయ, వ్యాపారవేత్తలు సైతం ప్రశంసలు కురింపించారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సోనూసూద్‌ను ప్రత్యేకంగా సన్మానించాడు. శాలువా కప్పి సత్కరించాడు.
బెల్లంకొండ శ్రీనివాస్-నభా నటేశ్ నటిస్తున్న నూతన చిత్రం ‘అల్లుడు అదుర్స్’లో ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ కీలక పాత్ర వహిస్తున్నారు. దీంతో ‘అల్లుడు అదుర్స్’ సినిమా సెట్‌లోనే ప్రకాశ్ రాజ్.. సోనూ సూద్‌ను సత్కరించాడని ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. ఈ సన్మాన కార్యక్రమం కనుల పండువగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటో కూడా షేర్ చేశాడు. నెట్టింట్లో ప్రస్తుతం ఈ ఫోటో చక్కెర్లు కొడుతోంది.