- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్లో ధరణికి ప్రశంసలు
దిశ, తెలంగాణ బ్యూరో : నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు భూవివాదాలు, తగాదాల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని బడ్జెట్ కొనియాడింది. భూ రికార్డుల ప్రక్షాళనతో దాదాపు 95 శాతం భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ధరణి భూపరిపాలనలో నూతన శకానికి నాంది పలికిందని కొనియాడారు. ఈ పోర్టల్ సాయంతో ప్రపంచంలో ఎక్కడ నుంచైనా, ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. ఇప్పటి వరకు 2.17 కోట్ల మంది ధరణి పోర్టల్‌ను వీక్షించినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ విధానం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగిందన్నారు. ఇప్పటి వరకు 3.29 లక్షల లావాదేవీలు జరిగాయని, 1.06 లక్షల పెండింగ్ మ్యూటేషన్లు పూర్తి చేసినట్లు వివరించారు.
డిజిటల్సర్వే
పక్కాగా భూరికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ సంవత్సరం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్ బుక్కులను అందించనున్నారు. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణ (ట్యాంపరింగ్)కు ఏ మాత్రం అవకాశం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా, దేవాలయ భూములు, వక్ఫ్, అటవీ భూములు, ప్రభుత్వ హద్దులు పరిష్కారమవుతాయని, అలాగే ఇతర భూముల వివాదాలకు పరిష్కారం లభించనుందని మంత్రి వివరించారు. ఈ బడ్జెట్లో సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు ప్రతిపాదించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రెండేండ్లు ఏటా రూ.1000 కోట్లు సమగ్ర భూ సర్వే కోసం కేటాయించారు.
అలాగే కేంద్రం నుంచి కూడా తొలి విడతగా రూ.84 కోట్లు మంజూరు చేసింది. అప్పడు కేటాయించిన నిధులు, మంజూరైన నిధులతో ఏయే పనులు చేశారన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని రెవెన్యూ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా రూ.400 కోట్లు కేటాయిస్తూ సమగ్ర భూ సర్వే కోసమంటున్నారు. నిజానికి ఆక్షాంశాలు, రేఖాంశాలు నిర్దేశించడం ద్వారా సమగ్రత ఎలా సాధ్యమవుతుందన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. సర్వే తర్వాత సెటిల్మెంట్చేయకుండా వదిలేస్తే ఇప్పటి పార్టు-బీ వివాదాలతో పాటు పార్టు-సీ కింద మరికొన్ని లక్షలు అపరిష్కృతంగా మారనున్నాయని అభిప్రాయపడుతున్నారు.