- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యన్ హార్ట్ గెలుచుకున్న ప్రభాస్
బాహుబలిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు
‘బాహుబలి’.. జక్కన్న చెక్కిన దృశ్య కావ్యం. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూ.. తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుత చిత్రం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాహుబలి పాత్రలో జీవించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కోట్లాది అభిమానులను సంపాదించిపెట్టింది. ఎన్నో అవార్డులు తన వాకిట నిలిచేలా చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. బాహుబలిగా రష్యా దేశ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రభాస్.. ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డు గెలుచుకున్నాడు. 2015 సంవత్సరానికి గాను ప్రభాస్ ఈ అవార్డు అందుకోగా.. బాహుబలి గొప్ప జీవిత అనుభవాలను కలిగిన సినిమాగా అభివర్ణించారు. పతాకస్థాయి సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉంటాయని.. ఏ టైమ్‌లో సినిమా చూసినా ఆస్వాదించగలమని తెలిపారు.
కాగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ కాగా.. 30 ఏళ్ల తర్వాత బాహుబలి ప్రభాస్‌కు మాత్రమే ఈ అవార్డు దక్కింది. ఆరాధన, శ్రీ 420, ఆవారా లాంటి సినిమాలతో రష్యన్ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్.. రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు అందుకుని.. ఈ అవార్డు అందుకున్న తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించాడు.