- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా కోళ్లు గుడ్లు పెట్టడం లేదు.. ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోండి!
దిశ, వెబ్ డెస్క్: కొన్నిసార్లు పోలీసులకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది వెతికి పెట్టండి… మా మేక ఎటో వెళ్ళిపోయింది కనిపెట్టండి అంటూ విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. ఈ కేసుల్లో.. సరే మిస్సింగ్ కేసులు.. పాపం వెతకలేక పోలీసులను ఆశ్రయించారు అనుకోవచ్చు. కానీ కోడి, గుడ్లు పెట్టకపోతే పోలీస్ కేసు పెట్టడమేంటి? .. విచిత్రంగా ఉంది కదా. మహారాష్ట్రలోని పోలీసులు సైతం అలాగే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ కేసు పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టారు? అనేది తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పౌల్ట్రీ ఫార్మ్ లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ నుండి గుడ్లు సరఫరా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా పౌల్ట్రీ లోని కోళ్లు, గుడ్లు పెట్టడం మానేశాయి. కోళ్లు గుడ్లు ఎందుకు పెట్టడం లేదో తెలియని యజమానులు ఆందోళన చెందారు. దీనికి కారణం కోళ్లకు పెడుతున్న దాణానే అని అనుమానించారు. వెంటనే పౌల్ట్రీ యజమానులందరు కలిసి పూణెలోని లాల్ భోర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తమ కోళ్లకు ఒక బ్రాండ్ కి సంబంధించిన దాణాను పెడుతున్నామని, ఆ దాణా తిన్న తర్వాత నుండి కోళ్లు, గుడ్లు పెట్టడం మానేశాయని వాపోయారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, సదరు దాణా కంపెనీ మీద కేసు నమోదు చేయాలనీ కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు సదురు కంపెనీ పై విచారణ చేపట్టారు.