- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు యూనివర్సిటీ దూర విద్యా కోర్సులకు ఆహ్వానం..
దిశ, ముషీరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికి గానూ దూర విద్యా కేంద్రం ద్వారా వివిధ కోర్సుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చని యూనివర్సిటీ ఇన్చార్జ్ ఉపాధ్యక్షులు నీతూ కుమారి ప్రసాద్ ప్రకటించారు. మంగళవారం యూనివర్సిటీ సమావేశ మందిరంలో దూర విద్యా కేంద్రం కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియకు చెందిన పోర్టల్‌ను ప్రారంభించారు.
దూర విద్యాకేంద్రం ద్వారా ఈ ఏడాది PG-డిప్లొమా కోర్సులైన TV-జర్నలిజం, జ్యోతిర్వాస్తులను ఏడాది కాల వ్యవధితో ఆఫర్ చేస్తున్నామన్నారు. అదే విధంగా రెండేళ్ల వ్యవధితో డిప్లమా కోర్సులైన లలిత సంగీతం, ఏడాది వ్యవధితో ఫిల్మ్ రైటింగ్ జ్యోతిష్యం, సర్టిఫికెట్ కోర్సులుగా సంగీత విశారద, ఆధునిక తెలుగు, జ్యోతిష్యం కోర్సులను అందిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బట్టు వివరించారు. నవంబర్ 31లోపు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. డిసెంబర్ 31 వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం తెలుగు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.teluguuniversity.ac.inను సంప్రదించాలని కోరారు.