ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా

by srinivas |   ( Updated:2020-03-15 03:58:39.0  )
ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విజృభింస్తున్న నేపథ్యంలో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ యధాతథంగా ఉంటుందని, కేవలం ఎన్నికలను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నతస్థాయి సమీక్ష తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనవారు, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో కలసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్నికల కోడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి పంచాయతీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. అత్యవరస పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉంటాయన్నారు. పంచాయతీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉందని, ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు చెప్పడంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా ఎఫెక్ట్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేశామని, కరోనా వైరస్‌ను నోటిఫై డిజాస్టర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారని ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటు వేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. దీంతో కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, విధిలేని పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నామన్నారు.

tag; local body elections, postponed, ap news

Advertisement

Next Story

Most Viewed