తెలంగాణాలో బడులకు తాళాలేనా ?

by Shyam |   ( Updated:2021-03-22 21:28:10.0  )
తెలంగాణాలో బడులకు తాళాలేనా ?
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్క రోజే 300కు పైగా కేసులు నమోదవుతుడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా పాఠశాలలు, వసతిగృహాల్లో ఉండడంతో వీటిని మూసేయడం వలన కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యాధికారులు సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో కరోనా లక్షణాలు త్వరగా బయటపడవు దీంతో వారి నుంచి వారి తల్లిదండ్రులకు కరోనా సోకే అవకాశం ఉంది. దీని వలన కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed