- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం
దిశ, వెబ్డెస్క్: టీటీడీకి చెందిన ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపుతోంది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. అయితే తిరిగి భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ వచ్చింది. దీంతో సదురు భక్తుడు టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఈవో జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈవో జవహర్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ కి సమాచారం అందించారు.
ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భక్తుడికి పోర్న్ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు ఆఫీసులో పోర్న్ సైట్లు చూస్తూన్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు అధికారులు. కార్యాలయంలో విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించారు. విధులు నిర్వహించకుండా వృధాగా కాలం గడుపుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధమవుతోంది.