పేదలు ఆకలితో చస్తుంటే.. బియ్యంతో హ్యాండ్ శానిటైజర్లు : రాహుల్

by vinod kumar |
పేదలు ఆకలితో చస్తుంటే.. బియ్యంతో హ్యాండ్ శానిటైజర్లు : రాహుల్
X

న్యూఢిల్లీ : హ్యాండ్ శానిటైజర్‌ల తయారీకి ఉపయోగించే ఇథనాల్ కోసం మిగులు ధాన్యాన్ని వాడుకునే కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సంపన్నులకు అనుకూలంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పేదలు నిరసించాలని పిలుపునిచ్చారు. హ్యాండ్ శానిటైజర్‌ల కోసం వినియోగించే ఇథనాల్‌కు బియ్యాన్ని ఉపయోగించుకునే బదులు ఆల్కహాల్ డిస్టిల్లరీలను సంప్రదించాలని సర్కారుకు సూచించారు. పేదల ఆకలిని పక్కనపెట్టి వారి ఆహారాన్ని సంపన్నులు చేతులు కడుక్కునే హ్యాండ్ శానిటైజర్‌ల కోసం ప్రభుత్వం ఉపయోగిస్తున్నదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

నెగెటివ్ థింకింగ్ పనికిరాదు : కేంద్ర మంత్రి

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ రామ్ విలాస్ పాశ్వాన్ స్పందించారు. ‘రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇథనాల్‌కు ఉపయోగించేది మిగులు ధాన్యాన్నే. అదీగాక, హ్యాండ్ శానిటైజర్లు కేవలం సంపన్నులకే కాదు కదా..’ అని పాశ్వాన్ అన్నారు. పేదలకు ఆహారమందించడంలో ప్రభుత్వం తన పాత్ర పోషిస్తున్నదని, రాష్ట్రాలకు ఇప్పటికే ఆహార ధాన్యాన్ని సప్లై చేసినట్టు ఆయన వివరించారు. కరోనాపై పోరులో ఇటువంటి నెగెటివ్ థింకింగ్ పనికి రాదు అని విమర్శించారు.

Tags: surplus, rice, ethanol, FCI, hand sanitisers, union minister, congress, rahul gandhi

Advertisement

Next Story