భర్త కొట్టాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ హీరోయిన్

by Shyam |   ( Updated:2021-11-09 04:35:36.0  )
భర్త కొట్టాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఐటెం గర్ల్ పూనమ్ పాండే తీవ్ర గాయాలతో హస్పిటల్‌లో చేరింది. తన భర్త సామ్ బాంబే(సామ్ అహ్మద్) చేతిలో గాయపడిన పూనమ్.. అతనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో గృహహింస కింద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో బాధపడుతున్న పాండే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కాగా రెండేళ్ల డేటింగ్‌ తర్వాత 27 జూలై, 2020న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత ఆర్నెళ్లకే పెళ్ళి చేసుకొని ఒక్కటయ్యారు. అయితే హనీమూన్‌ టూర్‌లోనే భర్త సామ్ తనపై దాడికి పాల్పడ్డాడని కంప్లయింట్ ఇవ్వడంతో.. గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులకు గొడవలు సద్దుమణగడంతో భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న పూనమ్.. తాజాగా మరోసారి భర్తపై ఫిర్యాదు చేసింది. అతను ప్రతీరోజు తనను శారీరకంగా హింసిస్తున్నాడని ఆరోపించింది.

నా బాడీ ఆ కాఫీలాంటిది.. ‘చీకటిగదిలో చితకొట్టుడు’ హీరోయిన్

Advertisement

Next Story

Most Viewed