- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుట్టబోయే బిడ్డ.. ఆడ లేదా మగ? డిసైడ్ చేస్తున్న పొల్యూషన్!
దిశ, ఫీచర్స్ : పుట్టబోయే బిడ్డ లింగాన్ని కాలుష్యం శాసిస్తోంది. ప్రాంతాన్ని బట్టి వెలువడే కాలుష్య ఉద్గారాలు.. బిడ్డ అమ్మాయిగా పుట్టాలా లేదా అబ్బాయిగా జన్మించాలా అనే విషయాన్ని డిసైడ్ చేస్తున్నాయి. దీన్ని బలపరిచే వందకు పైగా పాజిబిలిటీ ఫ్యాక్టర్స్‌ను చికాగో అండ్ కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం సూచించింది.
ఎనిమిదేళ్లకు పైగా ఉత్తర అమెరికా జనాభాతో పాటు 30 సంవత్సరాల స్వీడన్ జనాభా నుంచి సేకరించిన డేటా ఆధారంగా చేసిన పరిశోధనలు ఈ అంశాన్ని రుజువు చేసినట్లు అధ్యయనం పేర్కొంది. పొల్యూషన్ వల్ల ఆడ, మగ శిశువుల నిష్పత్తి మారిందని నిర్ధారించారు. పాదరసం, క్రోమియం, అల్యూమినియం వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉన్న చోట మగ శిశువులు ఎక్కువ సంఖ్యలో జన్మిస్తే.. సీసం సంబంధిత కలుషితాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆడ శిశువుల సంఖ్య పెరుగుతుందని గుర్తించారు. తల్లిదండ్రుల ఒత్తిడి స్థాయితో పాటు వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా బిడ్డ లింగాన్ని ప్రభావితం చేయగలవని చెప్తున్నారు.
మానవ లింగ నిష్పత్తి ఆధారంగా.. గర్భం దాల్చినప్పుడు పిండం ఆడపిల్ల లేదా మగ శిశువుగా మారేందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉంటాయి. కానీ గర్భధారణ సమయంలో వివిధ ప్రతికూల పరిస్థితులకు తోడు హార్మోన్ల ప్రభావం వల్ల అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానూ లింగ నిష్పత్తిలో తేడా వచ్చే అవకాశం ఉంది. అయితే గాలి, నీటి కాలుష్య కారకాలు రెండూ మానవ లింగ నిష్పత్తిని ప్రభావితం చేస్తాయని కొత్త అధ్యయనం పేర్కొంది. ప్రభావవంతమైన వాయు కాలుష్య కారకాల్లో ఇనుము, సీసం, పాదరసం, కార్బన్ మోనాక్సైడ్, అల్యూమినియం, పాలీ క్లోరినేటెడ్ బైఫినైల్స్ (PCBలు) ఉంటే.. నీటి కాలుష్య కారకాల్లో క్రోమియం, ఆర్సెనిక్ ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
పాదరస కాలుష్యం, ఇండస్ట్రియల్ ప్లాంట్స్‌కు సమీపాన ఉండటం వల్ల లింగ నిష్పత్తిలో మూడు శాతం వ్యత్యాసం చోటుచేసుకుందని గత అధ్యయనాలు వివరించాయి. కాబట్టి ఒక మిలియన్ జనాభాలో.. అబ్బాయిల కంటే అమ్మాయిలు సంఖ్య 60,000 ఎక్కువగా ఉన్నట్లు తెలిపాయి. కానీ గత పరిశోధనలు అసంపూర్తిగా ఉన్నాయని.. తాజా విశ్లేషణలో అబ్బాయిల సంఖ్య గణనీయంగా పెరిగిందని కొత్త అధ్యయనం చెబుతోంది.
- Tags
- effect