- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీసీసీ ఎన్నికపై అభిప్రాయ సేకరణ : ఉత్తమ్ కుమార్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని, పార్టీ శ్రేణుల మెజార్టీ ప్రకారమే నియామకం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ ఠాగూర్ బుధవారం హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో భారత్ బంద్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారని, బంద్‌ను విజయవంతం చేశారన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకే కొత్త చట్టం తెచ్చిందని మండిపడ్డారు. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తుందన్నారు.
రాష్ట్రంలో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, సన్నరకాల వడ్లు, పత్తి, జొన్నలకు మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని, రైతులకు మద్దతు ధర ప్రకటించి సమస్యల గురించి మాట్లాడాలని సలహా ఇచ్చారు. కాగా సోనియా గాంధీ బర్త్ డే వేడుకలను రాష్ట్రంలో పార్టీ శ్రేణులు జరుపుకోవద్దని, రైతుల ఆందోళనకు మద్దతుగా ఈ ఉత్సవాలకు దూరంగా ఉండాలని ఉత్తమ్ కోరారు.