ఒక్క రాత్రితో తారుమారైన వైసీపీ ఓటింగ్.. ఆ రాత్రి అసలేం జరిగిందంటే..?

by Indraja |
ఒక్క రాత్రితో తారుమారైన వైసీపీ ఓటింగ్.. ఆ రాత్రి అసలేం జరిగిందంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఒక్క రాత్రిలో జీవితాలు తారుమారయ్యాయి అని కథల్లో వింటుంటాం. అయితే ఆ ఒక్క రాత్రే వైసీపీ పతనానికి పునాది వేసిందంటే నమ్ముతారా..? అవును ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ ని మార్చిందీ, 151 యొక్క సీట్లను గెలిచి ఒక చరిత్రను సృష్టించిన పార్టీని పాతాళానికి తొక్కిందీ ఒక్క రాత్రి జరిగిన అనాలోచిత, అన్యాయపూరిత ఘటన.

అదే 2023 సెప్టెంబర్ 9. ఆరోజు తెల్లవారుజామున 3 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి చేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అదే వైసీపీకీ శాపంగా మారింది.

వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపిన చంద్రబాబు అరెస్ట్..

ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతని ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తెల్లవారుజామున ఎలా అరెస్ట్ చేస్తారు అని పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్రం ప్రశ్నించింది. పైగా అప్పటికే చంద్రబాబు నాయుడు పలు బహిరంగ సభలను పెట్టి ప్రజలను ఆకర్షించారు. అలానే నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం టీడీపీపై ప్రజల్లో సానుకూల ప్రభావం చూపిందనే చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు.

వైసీపీపై పవన్ పంజా..

చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తన పార్టీ నేతలతో సమావేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు హెలీకాఫ్టర్‌లో వచ్చేందుకు ఆయనకు ఎయిర్‌లైన్స్ నుండి అనుమతి సైతం లభించింది. ఈ నేపథ్యంలో విజయవాడ వచ్చేందుకు ఆయన రెడీ అయిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తే శాంతి భద్రతలకు ఆటంకం వాటిల్లుతుందని కృష్ణా జిల్లా ఎస్పి లేఖ రాశారని చెబుతూ హైదరాబాద్ నుండి విజయవాడకు హెలీకాఫ్టర్‌లో వచ్చేందుకు పవన్‌‌కు ఇచ్చిన అనుమతిని ఎయిర్‌లైన్స్ రద్దుచేసింది.

దీనితో పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాహనం జగ్గయ్యపేటకు చేరుకోగానే అక్కడ పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడకు వెళ్లడానికి అనుమతించము అని చాలాసేపు ఆయనను హైవే పైన ఆపేశారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంటే వేరే దేశం కాదని, అది కూడా భారత దేశంలోనే ఉందని, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రావడానికి వీసా పాస్పోర్ట్ అడిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందా అని ప్రశ్నించారు.

ఇది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ ఎవరైనా దేశంలోఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని మండిపడ్డారు. ఈ ఘటన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది ప్రజాస్వామ్య దేశమా..? లేకపోతే రాచరికమా..? అని ప్రజలకు సందేహం కలిగేలా నాటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అంటున్నారు విశ్లేషకులు. ఆ ఘటనతో ఆరోజు రాత్రి వైసీపీపై చాలావరకు నెగిటివిటీ వచ్చింది అని తెలుస్తోంది.

ఆంధ్రాలో కూటమిని ఆహ్వానించింన ప్రజలు.. కారణం ఇదే..!

చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలోనే జనసేన టీడీపీతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని వార్త వెలుగు చూసింది. ఆ వార్తలు వాస్తవమే అని తెలుపుతూ కూటమిని ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్, అనేలా జగన్ పరిపాలన ప్రజలకు నియంత పాలనలా అనిపించడం, ఉచిత పథకాలనే నమ్ముకోవడం, భారీ మొజారిటీతో గెలిచామనే గర్వం, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం, ఎమ్యెల్యేలు భూతులు మాట్లాడం, చట్టసభలో, మీడియా, సోషల్ మీడియా సమావేశాల్లోనూ ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షనేలపై వ్యక్తిగత విమర్శలు చేయడం వంటి అనేక కారణాలచేత ఆంధ్రా ప్రజలు కూటమిని ఆహ్వానించారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed