- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో లక్కీ హ్యాండ్‌కు బ్రేక్.. తెరపైకి కొత్తనేత పేరు!
దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పాలని కమలనాథులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే అందుకు తగిన వ్యూహాన్ని కాషాయదళం రచించేపనిలో నిమగ్నమైంది. పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించి గెలుపు జెండా పాతాలన్నదే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈనెల మొదటివారం నుంచి పూర్తిస్థాయిగా ముఖ్య నేతలు పర్యటనలు మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతాయని సమాచారం. క్రమంగా శ్రేణులు తమ ప్రచారాన్ని స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు తగిన గ్రౌండ్ వర్క్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. భారీ బహిరంగ సభలను నిర్వహించాలని చూస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే నాలుగో విడుత యాత్ర ద్వారా కూడా పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశాలున్నాయని కాషాయదళం అంచనా వేస్తోంది.
మునగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాగా బీజేపీ శ్రేణులు ఈ బైపోల్‌కు ఇన్ చార్జిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని నియమించాలని రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. సమన్వయకర్తగా గంగిడి మనోహర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి లక్కీ హ్యాండ్‌గా చెప్పుకునే ఏపీ జితేందర్ రెడ్డికి ఎలక్షన్ వార్ రూమ్ ఇన్ చార్జీగా నియమించనున్నట్లు సమాచారం. దుబ్బాక, హుజురాబాద్ బైపోల్‌లో ఇన్‌చార్జీగా బాధ్యతలు తీసుకున్న జితేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కాగా ఇప్పుడా లక్కీ హ్యాండ్‌కు బ్రేక్ ఇచ్చి వివేక్‌కు ఇన్ చార్జిగా నియమించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గంగిడి మనోహర్ రెడ్డికి సమన్వయకర్తగా బాధ్యతలు అందించి నేతల మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా చూడాలని సూచించే అవకాశాలున్నాయి. బూత్ స్థాయిలో అటు పార్టీకి, ఇటు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూడటం మనోహర్ రెడ్డి బాధ్యత.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో బైపోల్ రానుంది. కాగా ఈ ఎన్నికలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ ఉప ఎన్నికలోనూ విజయదుందుభి మోగించి ప్రజలంతా తమవైపే ఉన్నారనే సంకేతాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉండగా అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ ఇతరత్రా అంశాలపై దృష్టిపెట్టిన బీజేపీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్‌ను షురూ చేసింది. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత పూర్తిస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేయయనుంది. అందులో భాగంగా ఈనెల 5, 6, 7 తేదీల్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ మునుగోడులో మకాం వేయనున్నారు. అక్కడి వాస్తవికతను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించిన కమలనాథులు నియోజక వర్గానికి ఎన్నికల ఇన్ చార్జి, సహ ఇన్ చార్జి, మండల ఇన్ చార్జీలను నియమించనుంది. ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీతో పాటు ఇతర కమిటీలను వేయనుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఇన్ చార్జీలను నియమించాలనే ఆలోచనలో పార్టీ ఉంది.
మునుగోడు నియోజకవర్గంలో 295 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. వీటిని 89 శక్తి కేంద్రాలుగా బీజేపీ విభజించింది. ఈ శక్తి కేంద్రాలకు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఇన్ చార్జీలను నియమించింది. ఒక్కో శక్తి కేంద్రానికి నలుగురు నేతలను ఇన్ చార్జీలు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మునుగోడులో ఇంటింటికీ తిరిగి ఇంటింటి ప్రచారం చేపట్టాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇదిలాఉండగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక సందర్భంగా గత నెల 21వ తేదీన భారీ బహిరంగ సభను మునుగోడులో నిర్వహించింది. కాగా ఇప్పుడు మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఈనెల 22వ తేదీన ఈ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు టాక్. అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్ నడుమ ఈ సభ నిర్వహించాలని ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ఈ సభకు జీతీయ స్థాయి నేతలను తీసుకురావాలని బీజేపీ శ్రేణులు యోచిస్తున్నారు. పల్లె గోస బీజేపీ భరోసలో భాగంగా బైక్ ర్యాలీలు కూడా మునుగోడులో నిర్వహించి తమ పార్టీ ప్రభావాన్ని చూపాలని బీజేపీ డిసైడ్ అయింది.
Also Read : ఇదీ సంగతి: బీజేపీ విధానాలతో దేశం బాగుపడేనా?