- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ ఎదుగుదలకు కారణం వారిద్దరే.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగిందంటే అందుకు మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ ఉప ప్రధాని ఎల్.కే అద్వానీలే కారణం అని అన్నారు. ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన గడ్కరీ పార్టీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేడు ఈ స్థాయిలో బలోపేతం కావడానికి వాజ్ పేయి, అద్వానీ వంటి వారే కారణం అన్నారు. ఒకనాడు లోక్‌సభలో రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈరోజు జాతీయ రాజకీయాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం వెనుక ఈ నేతల కృషి ఉందన్నారు.
గతంలో వాజ్ పేయి చేసిన ప్రసంగం తనకు ఇంకా గుర్తు ఉందన్నారు. చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్ పేయి చెప్పారని ఆ సదస్సులో తానూ ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాట నిజమైందని అన్నారు. వాజ్ పెయి, అద్వానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఇంకా మరెందరో కార్యకర్తల కృషి వల్లే ప్రస్తుతం పార్టీ మోడీ నాయకత్వంలో అధికారంలో ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలగురించే ఆలోచిస్తారని దేశాన్ని సమాజాన్ని నిర్మించాలనుకునే సామాజిక, ఆర్థిక సంస్కర్తలు దూరదృష్టితో రాబోయే దశాబ్దపు అభివృద్ధి గురించి ఆలోచిస్తారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త దివంగత దత్తోపంత్ ఠెన్గడీ గతంలో చెప్పారని గుర్తుచేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోయడమేంటి.. Addanki Dayakar ఆగ్రహం