Thackeray: రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరిన ప్రముఖ పార్టీ అధినేత.. ఎందుకో తెలుసా..?

by Disha Web Desk 3 |
Thackeray: రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరిన ప్రముఖ పార్టీ అధినేత.. ఎందుకో తెలుసా..?
X

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల గురించిన చర్చ జోరుగా సాగుతోంది. అటు సార్వత్రిక ఇటు అసెంబ్లీ ఎన్నికలతో దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో, ఎప్పుడు ఎవరితో విడిపోతుందో అర్థం కాని పరిస్థితి నేడు దేశంలో నెలకొంది. తాజాగా ప్రముఖ పార్టీ అధినేత గత ఎన్నికల్లో మోడీకి మద్దతుగా నిలిచినందుకు తనను క్షమించాల్సిందిగా ప్రజలను కోరారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ప్రముఖ పార్టీ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరారు. హత్కనంగలే నియోజకవర్గం నుండి శివసేన (యుబిటి) అభ్యర్థి సత్యజిత్ పాటిల్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్‌కరంజిలో ర్యాలీ నిర్వహిచారు. ఈ ర్యాలీలో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పాల్టన్నారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతకుముందు ఎన్నికల్లో ప్రధానికి ఓట్లు వేయాలని కోరినందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా.. ప్రజలు నన్ను క్షమించండి అని కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహారాష్ట్రకు ద్రోహం చేసిందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed