- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ తమ్మినేని తప్పుడు సర్టిఫికెట్లతో అడ్మిషన్ పొందారు.. చర్యలు తీసుకోండి: టీడీపీ
దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. గౌరవ ప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ఆధారాలను కూన రవికుమార్ బట్టబయలు చేశారు. అందుకు ఆధారాలను మీడియాకు విడుదల చేశారు.
అంతేకాదు డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడేళ్ల న్యాయవిద్యలో అడ్మిషన్ పొందారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన సాక్ష్యాలతో సహా రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా అడ్మిషన్ పొందిన నేపథ్యంలో స్పీకర్‌పై తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కూన రవికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read more: