MLC కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉంది: సుకేశ్ లాయర్

by GSrikanth |   ( Updated:2023-04-13 13:38:20.0  )
MLC కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉంది: సుకేశ్ లాయర్
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత అన్నారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయని కవిత సుకేశ్ లేఖపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా.. కవిత రియాక్షన్‌పై సుకేశ్ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్ స్పందించారు.

‘నా క్లయింట్ సుకేష్ చందర్‌శేఖర్ లేవనెత్తిన నిజాలపై కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉంది. సుకేష్ తన వాదనలకు మద్దతుగా అనేక డిజిటల్ సాక్ష్యాలను అందజేశారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులోని సెక్షన్ 65 బి ప్రకారం వాంగూల్మం కూడా సుకేశ్ జత చేశాడు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు, ఆమె దర్యాప్తు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. న్యాయమైన, అనుభవజ్ఞుడైన, నిఖార్సైన రాజకీయ నేత ఎవరైనా ఈ విషయంలో విచారణను స్వాగతిస్తారు. తద్వారా నిజం బయటపడుతుంది. అయితే, కవిత ప్రతిస్పందన, ఏజెన్సీల నుండి దాగుడు మూతలు ఆడినట్లు ఉంది. కవిత తన ప్రకటనలో తన వాక్పటిమ నైపుణ్యాన్ని చూపారు. మీడియా మరియు రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్ లాగా కవిత ప్రకటన ఉంది. ప్రస్తుత విషయం ప్రత్యేక ఏజెన్సీల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినది. సాధారణ ప్రజల్లో ప్రజాదరణ పోటీకి సంబంధించిన విషయం కాదు. ఈ వారంలోనే నా క్లయింట్ ద్వారా దీనిపై వివరణాత్మక ప్రతిస్పందన అందిస్తాము.’’ అంటూ సుకేశ్ చంద్రశేఖర్ తరపు న్యాయవాది కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read...

సుఖేశ్ లేఖ‌పై కవిత రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story