Sri Reddy: జగన్ ఓటమిపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

by Indraja |   ( Updated:2024-06-06 05:06:09.0  )
Sri Reddy: జగన్ ఓటమిపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
X

దిశ వెబ్ డెస్క్: 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో గోరాతి ఘోరంగా పరాజయాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ ఓటమిపై ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి స్పందించారు. గెలిచినా, ఓడినా జగనన్నతోనే ఉంటామని ఆమె అన్నారు. పేదోడు, పెద్దోడు ఇద్దరు కలిసి జగన్‌ను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓడిపోయినందుకు బాధపడవద్దని, కేడర్‌కి కొత్త ఊపిరి పొయ్యాలని, ఓడిన చోటనే నిలబడి పోరాడాలని, నిన్ను నమ్ముకున్న వాళ్లందరి కోసం బలం తెచ్చుకోవాలి అని జగన్‌కు శ్రీ రెడ్డి ధైర్యం చెప్పారు. అరణ్యం పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్టు పట్టు వదలకుండా తన రాజకీయాన్ని చాకచక్యంగా జగన్ కొనసాగిస్తాడని, ఆయన సైన్యంగా తామంతా ఉన్నామని శ్రీ రెడ్డి అన్నారు.

కాగా శ్రీ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ చూసి నెటిజన్స్ శ్రీ రెడ్డిపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. అప్పులు తేవడం ప్రజలపై మోపడం, ఒకటో తారీకు జీతం కూడా ఇవ్వలేని వాడు, భూకబ్జాలు చేసుకుంటూ దోచుకుని దాచుకునే వాడు పేదోడు, అది నువ్వు చెప్పడం మేము వినడం, పతిత్తు మాటలు మానుకుంటే మంచిది అంటూ శ్రీరెడ్డి పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story