వైఎస్ జగన్, షర్మిల మధ్య పెరిగిన గ్యాప్.. ఇదిగో సాక్ష్యం ..?

by Nagaya |
వైఎస్ జగన్, షర్మిల మధ్య పెరిగిన గ్యాప్.. ఇదిగో సాక్ష్యం ..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ప్రతీఏటా వస్తున్న ఆనవాయితీని ఈసారి బ్రేక్ చేయనున్నారు. క్రిస్మస్ వేడుకలను ఈసారి అమెరికాలో చేసుకోనున్నారు. ప్రతీఏటా కుటుంబ సభ్యులతో పులివెందులలో నిర్వహించే సెలబ్రేషన్స్ కు ఈసారి ఆమె దూరంగా ఉండునున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు రకాల చర్చలు వినిపిస్తున్నాయి. అన్నా, చెల్లెలి మధ్య గ్యాప్ ఇంకా పెరిగిందా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ కొనసాగుతోంది. ప్రతీ ఏటా పులివెందులలో తన తండ్రి సమాధికి నివాళులర్పించిన అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. తెలంగాణలో పార్టీ పెట్టాక గతేడాదీ ఆమె పులివెందులకు వెళ్లి కుటుంబ సభ్యులతో షర్మిల వేడుకల్లో పాల్గొన్నారు. కానీ ఈసారి ఏమైందో ఏమో కానీ పులివెందులలో వేడుకకు దూరంగా ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. గతంలో నుంచే అన్నా, చెల్లికి ఆస్తి తగాదాల కారణంగా కాస్త ఎడమొహం, పెడమొహంగా ఉంటారని వార్తలు వచ్చాయి. దీనిపై షర్మిల కూడా ప్రతి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలున్నా చివరికి తామంతా ఒక్క కుటుంబమని దాటవేశారు.

ఈనెల 17వ తేదీన షర్మిల అమెరికాకు వెళ్లారు. అదే రోజు తన పుట్టినరోజున ఉండగా ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, శ్రేణులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశచెందిన విషయం తెలిసిందే. అమెరికాకు వెళ్లిన ఆమె క్రిస్మస్ కు ముందు ఇండియాకు తిరిగి చేరుకుని పులివెందులకు చేరుకుంటారని అనుకున్నారు. కానీ జనవరి 5వ తేదీన షర్మిల తిరిగిరానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే షర్మిల తెలంగాణలో 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి తన గత రికార్డులను తిరగరాశారు. నర్సంపేటలో తన యాత్రను అడ్డుకున్న నాటి నుంచి ఇప్ప టి వరకు ఒకట్రెండు మినహా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపడుతామని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతి తర్వాతే పార్టీ యాక్టివిటీ మొదలుకానుంది. సంక్రాంతి తర్వాత వారం నుంచి 10 రోజుల పాటు పాదయాత్ర చేపట్టి వరంగల్ లో ముగింపు సభను నిర్వహించాలని షర్మిల భావిస్తోంది. ఆ తర్వాతే బస్సు యాత్రకు సంబంధించి రోడ్డు మ్యాప్ పై క్లారిటీ రానుంది.

Also Read..

మంత్రుల తీరుపై BRS శ్రేణుల విస్మయం.. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై అసంతృప్తి!

టీ కాంగ్రెస్‌లోకి ఏపీ నేత ఎంట్రీ.. రేవంత్‌కు ఫుల్ సపోర్ట్

Next Story

Most Viewed