రూ.10లక్షలతో బుక్స్ కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. ఎక్కువగా కొన్న బుక్స్ ఇవే?

by Jakkula Mamatha |
రూ.10లక్షలతో బుక్స్ కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. ఎక్కువగా కొన్న బుక్స్ ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2వ తేదీన పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పుస్తక మహోత్సవం రేపటితో(ఆదివారం) ముగియనున్నది. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పుస్తక మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణి పబ్లికేషన్స్, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించిన పవన్ కళ్యాణ్ చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు.

ఈ నేపథ్యంలో విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం లో డిప్యూటీ సీఎం పవన్ రూ.10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశారు. 6, 9 తరగతుల పుస్తకాలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువగా డిక్షనరీలు తీసుకున్నారు. బుక్ ఫేయర్‌లోని ‘ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకం ఎన్ని ఉంటే అన్ని పవన్ కళ్యాణ్ ఆర్డర్ చేశారు. ఈ పుస్తకాలతో తన సొంత నియోజకవర్గం పిఠాపురం(Pithapuram)లో డిప్యూటీ సీఎం పవన్ ఓ గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

Next Story

Most Viewed