- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ యాత్రపై కుట్రపూరిత దాడి: రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నిన్న అస్సాంలో పర్యటించారు. ఈ క్రమంలోనే న్యాయ్ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అస్సాంలోని సోనిత్ పూర్‌లో యాత్రను బీజేపీ కార్యకర్తలు యాత్రను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు.
ఈ ఘటన వెనుక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై కుట్రపూరిత దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీగా కాంగ్రెస్.. యాత్ర ముందుకు సాగాలన్న మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది.. అని పేర్కొన్నారు.