- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ఆ చోట ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. ఈసారి ఎలాంటి కామెంట్స్ చేస్తారో..!
దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరు వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు ఇటీవలే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును ఆధారంగా లోక్ సభ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో దేశంలోని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మోడీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పీఎం మోడీ కక్షసాధింపుకు పాల్పడుతున్నారంటూ విపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇక రాహుల్ అనర్హత విషయంలో కాంగ్రెస్ పార్టీ 30 రోజల పాటు పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటానికి గల కారణం ఆయన 2019లో చేసిన వ్యాఖ్యలు.
2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ కొలార్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రోడ్డు షో, బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశంలోని దొంగలందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంది అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ‘మోడీ’ వ్యాఖ్యలను నిరసిస్తూ గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాలుగేళ్లు సాగిన ఈ కేసు విచారణలో ఇటీవలే సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేసింది.
అయితే తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మోడీ’ వ్యాఖ్యలు చేసిన కొలార్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారని పార్టీ నేతలు తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ ఆ వేదిక మీద మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఎక్కడైతే తాను ‘మోడీ’ వ్యాఖ్యలు చేశాడో ఆ వేదిక మీది నుంచే రాహుల్ తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్లోని కొందరు నేతలు చెబుతున్నారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీలను ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, కానీ తన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు వక్రీకరించారంటూ రాహుల్ స్పష్టం చేసే ఛాన్స్ ఉందని వారు తెలిపారు.